- Advertisement -
మనతెలంగాణ/మహాముత్తారం: మండలంలోని లోతట్టు ప్రాంతమైన సింగారం శివారులో ఏర్పాటుచేసుకున్న గుత్తికోయ గూడెంలో మహాముత్తారం పోలిసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను బుధవారం నిర్వహించారు. మహాముత్తారం ఎస్‌ఐ దాసరి సుధాకర్ ఆధ్వర్యంలోని సివిల్, సిఆర్‌పిఎఫ్ పోలిసులు కార్డెన్‌సర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే పోలిసులకు సమాచారం అందించాలని, ఎవరు మావోయిస్టులకు సహకరించవద్దని, సహకరించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిలో వన్యమృగాలను వేటాడడం, ఉచ్చులు పెట్టడం, విద్యుత్ తీగలు పెట్టడం వంటివి చేయకూడదని అన్నారు. ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గుడుంబాను ఎవరు తయారుచేసిన, అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు.
- Advertisement -