Monday, December 23, 2024

సమాజ సేవ ప్రతీ ఒక్కరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

కోల్‌సిటీ: సమాజ సేవ ప్రతీ ఒక్కరి బాధ్యతని, ప్రతీ ఒక్కరూ తోచినంత సహాయం అందిస్తూ పేదలకు అండగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం శారదా నగర్ ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ నగర్, చంద్రబాబు నాయుడు కాలనీ, శాంతినగర్, సప్తగిరి కాలనీకి చెందిన 100 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులను, పుస్తకాలను ఎమ్మెల్యే అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతి గాంధీ రెండవ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు అందించచడం అభినందనీయమని, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న జ్యోతిగాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దయానంద్ గాంధీని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, కార్పొరేటర్‌కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, కో ఆప్షన్ సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి, వంగ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మివాణి, సునీత, సంతోష రెడ్డి, ముద్దసాని సంధ్యారెడ్డి, లక్ష్మణ్, జాకబ్, బక్కం శ్రీనివాస్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News