Thursday, January 23, 2025

సమాజ సేవ ఎంతో సంతృప్తినిస్తుంది

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: సమాజంలో పేదలకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని జీహెచ్‌ఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, విఎస్టీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ రాంనగర్ డివిజన్ మహిళా నాయకురాలు కల్పన ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో బిఆర్‌ఎస్ మాజీ డివిజన్ అధ్యక్షులు రేషం మల్లేశం జన్మదిన వేడుకలను గు రువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని పేదలు, వృద్దులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రేషం మల్లేశం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అత్యంత కీలకంగా పని చేశారన్నారు. సీఎం కేసీఆర్, మాజీ హోం మంత్రి నాయిని ఆదేశాల మేరకు ముషీరాబాద్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ అభివృద్దికి రేషం మ ల్లేశం అహర్నిశలు కృషి చేశారన్నారు. తన పుట్టిన రోజున డబ్బును వృథా చేయకుండా, పేదల మధ్య జరుపుకోవడం ఎంతో అభినందనీయం అన్నారు.

ఈ సందర్భంగా రేషం మల్లేశంకు పలువురు శాలువా, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి శ్యామ్, కొండ శ్రీనివాస్ నేత, సత్యనారాయణ, అరుణ్, వెంకటేష్, బన్నీ, రాజేష్, కార్తీక్, అజ్జు, సాయి, సాలమ్మ, లీలాదేవి, రేఖ, సబిత, తుల సీ, మంజుల, శోభ, తిరుమల, మేరీ, అనురాధ, స్వరూప, రేణుక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News