Saturday, November 9, 2024

అభివృద్ది , సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి
  • మేడ్చల్ కలెక్టరేట్‌లో వైభవంగా తెలంగాణ సంక్షేమ సంబురాలు

మేడ్చల్ జిల్లా: అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ సంక్షేమ సంబురాలను వైభవంగా నిర్వహించారు. మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ధి శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, నీటి పారుదల అభివృద్ది సంస్థ ఛైర్మన్ ప్రకాష్‌తో పాటు జిల్లాలోని ప్రజా ప్రతిధులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జిల్లాలో బిసి కుల వృత్తుల వారికి రూ.లక్షల ఆర్ధిక సహాయం ప్రొసిడింగ్ కాఫీలు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాల పట్టాలు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్ చెక్కులు, రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రొసిడింగ్స్ అందజేశారు. ఈసందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రజలు సుఖ శాంతులతో ఉన్నారని అన్నారు. పదేళ్లలో తెలంగాణ అద్బుతమైన ప్రగతిని సాధించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్దికి కంకణబద్దులై నిత్యం పరితపిస్తున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మంచినీటికి గోస పడ్డాడమని, నేడు మిషన్ బగీరథ ద్వారా ఇంటింటికి కృష్ణా, గోదావరి జలాలు అందుతున్నాయని తెలిపారు.

సాగు, త్రాగు నీరు, 24 గంటల విద్యుత్, పేద విద్యార్ధులకు ఆంగ్లంలో బోదన, పల్లె ప్రగతి, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, రైతులకు రైతు బంధు, రైతు బీమా, దళితులకు దళితబంధు, పేదింటి ఆడ బిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వివరించారు. ఆర్ధికంగా వెనుకబడిన దళితుల కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా బిసి కుల, చేతి వృత్తుల వారికి రూ.లక్షల ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మేడ్చల్ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు రూ.34 కోట్ల ఆర్ధిక సహాయం అందజేశామని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిపొందిన వారి కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిస్తుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ నేడు తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందని కుటుంబం లేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుందన్నారు. పేదల సంక్షేమమే పరమావదిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. నీటి పారుదల అభివృద్ది సంస్థ ఛైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మించి అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు.

జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన పలువురు సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News