Monday, March 17, 2025

582 కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖలో 582 మంది అర్హులకు కారుణ్య నియామకాలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం కలిగించే ముఖ్యమైన చర్యలో భాగంగా, తమ ఏకైక సంపాదనను కోల్పోయిన కుటుంబాల దుస్థితిని హైలైట్ చేస్తూ, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం. జగదీష్, సెక్రటరీ జనరల్ ఎలూరి శ్రీనివాసరావు చేసిన నిరంతర విజ్ఞప్తుల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ కుటుంబాలకు జీవనోపాధిని కలిగించడానికి సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించడం ద్వారా కారుణ్య నియామకాలు సులభతరమయ్యాయి. ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్‌మెన్ పోస్టులను టెంపరరీ, సూపర్ న్యూమరీ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్‌లుగా 524 పోస్టులు, 58 సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పోస్టులను 25 జిల్లాల్లో ఆయా అవసరాలను బట్టి కారుణ్య నియామకాల కింద భర్తీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News