Tuesday, November 5, 2024

ఆర్టీసిలో కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఆర్టీసిలో ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు కారుణ్య నియామకాల కింద రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి జేఏసి చైర్మన్ కె.రాజిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసిలో కారుణ్య నియామకాలపై నిషేధం విధించడంతో ఏళ్ల తరబడి సుమారు పదకొండు వందల మంది ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని రాజిరెడ్డి, కో -కన్వీనర్ కె.యాదయ్యలు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆ కుటుంబాలను ఆదుకోవాలని వారు సూచించారు. ఆర్టీసిలో కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలని, ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థులను రెగ్యులర్ పోస్టుల్లో నియమించి వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యాచరణ ప్రకటిస్తామని రాజిరెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News