Wednesday, January 22, 2025

ఐఎఎఫ్ ఎయిర్ షో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం

- Advertisement -
- Advertisement -

చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్ షో కోసం తమిళనాడు అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలు అందజేశారని, భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కోరినవాటి కన్నా అవి బాగా ఎక్కువే అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం వెల్లడించారు. మెరీనా బీచ్‌లో ఎయిర్ షో తరువాత ఎండ వేడిమి సంబంధిత సమస్యల కారణంగా మరణించినవారి కుటుంబాలకు రూ. 5 లక్షలు వంతున నష్ట పరిహారాన్ని కూడా స్టాలిన్ ప్రకటించారు. ఆదివారం మెరీనా బీచ్‌లో ఐఎఎఫ్ ఎయిర్ షక్ష తరువాత ఎండ వేడిమి సంబంధిత సమస్యల కారణంగా కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించగా 100 మందిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. స్టాలిన్ ఆ విషయమై మాట్లాడుతూ, ‘ఎయిర్‌షో అనంతరం జనం తిరిగి వెళుతూ తమ వాహనాల వద్దకు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ అంశాలపై మరింతగా దృష్టి పెట్టి, తదనుగుణంగా ఏర్పాటు చేయగలమని చెప్పారు.

ఎండ వేడిమి సమస్యల కారణంగా ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యన్ తెలిపారు. మెరీనా బీచ్‌కు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 100 మందిని చేర్పించారు. వారిలో ఏడుగురికి చికిత్స అందిస్తుండగా, 93 మందిని డిశ్చార్జి చేశారు. ‘ఐఎఎఫ్ విజ్ఞప్తి చేసినదానికి మించి ఎయిర్ షో కోసం తమిళనాడు ప్రభుత్వం అవసరమైన పాలనపరమైన సహకారాన్ని, సౌకర్యాలను అందజేసింది. అంచనాలకు మించిన సంఖ్యలో జనం హాజరైనందున కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను, ప్రజా రవాణా బస్సులు చేరుకోవడానికి జనం ఎంతగానో ఇబ్బంది పడ్డారని నాకు తెలిసింది’అని సిఎం తెలిపారు. ‘ఈసారి అటువంటి భారీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఈ అంశాలపై మరింతగా దృష్టి పెట్టగలం, తదనుగుణంగా ఏర్పాట్లు చేయగలం’ అని ఎంకె స్టాలిన్ తెలియజేశారు. ప్రజలు మండే ఎండలో కనీసం రెందు నుంచి మూడు గంటల పాటు నిల్చున్నారు. వారిలో అనేక మంది ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు చేత పట్టుకున్నారు. ఎయిర్ షోను ఆదివారం ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం ఒంటి గంట మధ్య నిర్వహించినప్పటికీ అనేక మంది ప్రజలు కనీసం ఒక గంట ముందే బీచ్ వద్ద సమీకృతం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News