Thursday, September 19, 2024

రెండు రోజుల్లో పంటనష్టాలకు పరిహారం

- Advertisement -
- Advertisement -

ప్రకృతి విపత్తులతో పంటలను నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఊరట కల్పించబోదోంది. రెండు రోజల్లో సాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో రాష్ట్రంలో వ్యవసాయరంగం దెబ్బతింది. లక్షల ఎకరాల్లో పైర్లు నీటమునిగాయి . వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో ఖరీఫ్ కష్టమంతా కన్నీటిపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని ప్రకటించారు. నష్టపోయిన ప్రతి ఎకరాదకు నిభంధనలను బట్టి రూ.10వేలు సాయం అందజేస్తామంటూ చేసిన సిఎం ప్రకటన రైతుల్లో భరోసా కల్పించింది. వ్యవసాయశాఖ ఇప్పటికే రాష్ట్రంలో సర్వేనెంబర్లు రైతుల వారీగా క్షేత్ర స్థాయిలో పొలాలు పరిశీలించింది. వరి , పత్తి ,మొక్కజొన్న తదితర పైర్లు అధికంగా దెబ్బతిననాయి .రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 4.15లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించిన వ్యవసాయరంగానికి జరిగిన నష్టాలను కళ్లారా చూశారు. అంతకు ముందుగానే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ రంగాలకు జరిగిన నష్టాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు నివేదిక సమర్పించారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల రాష్ట్రంలో వివిధ రంగాలకు రూ.10330కోట్లు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. అందులో వ్యవసాయరంగానికి రూ.231కోట్లు నష్టం జరిగినట్టు ప్రభుత్వం కేంద్ర బృందాలకు నివేదిక అందజేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం పంటలు నష్టోపోయిన రైతులకు ఊరట కల్పించాలన్న నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తక్షణ సాయం కింద తెలంగాణకు రూ.1300కోట్లు కేటాయించినట్టు వెల్లడించింది. అయితే ఈ నిధులు రాష్ట్రానికి ఇంకా అందలేదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్ర సాయం వచ్చేలోగా రాష్ట్ర రైతానికి ఉపశమనం కల్లిచేందుకు నిర్ణయించారు.

వరదల్లో పంటలు కోల్పొయిన రైతులకు రెండు రోజుల్లో రూ.10వేలు సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు రెవెన్యూ మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితొకలిసి ఢిల్లీవెళ్లి ప్రధాని నరేంద్రమోడిని కలవనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేదాక వేచి చూడకుండా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట నష్టం పరిహారాలు అందచేసేందకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు రెవెన్యూ మంత్రి చేసిన ప్రకటన బాధిత రైతాంగాని ఊరటనివ్వనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News