Monday, April 14, 2025

మార్చిలో జరిగిన పంట నష్టానికి త్వరలో పరిహారం

- Advertisement -
- Advertisement -

గత మార్చి నెలలో కురిసిన వర్షాలు, వడగండ్ల వానకు రాష్ట్ర వ్యాప్తంగా 8,408 ఎకరాలలో పంటన ష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాల వారీ గా, రైతులవారీగా వ్యవసాయశాఖ అధికారికంగా నివేదిక అందించినట్లు మంత్రి వెల్లడించారు. పంటనష్టపోయిన రైతాంగానికి- త్వర లో పరిహారం చెల్లింపుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 3 నుంచి 9 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలకు, వడగండ్ల వానకు, ఈదురు గాలులకు జరిగిన నష్టంపై కూడా వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌లో ఇప్పటివరకు 14,956 ఎకరాలలో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు వివరించారు.లో జరిగిన పంట నష్టానికి త్వరలో పరిహారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News