Wednesday, January 22, 2025

తుపాను బాధితులకు నష్టపరిహారం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి రూ.6,000 నగదు సహాయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ప్రకటించారు. ఇదే కాకుండా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇచ్చే పరిహారం మొత్తాన్ని కూడా పెంచారు. జీవనోపాధి దెబ్బతిన్న వ్యక్తులకు ఇచ్చే నగదు సహాయాన్ని రేషన్ షాపుల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని ప్రజలకు చెల్లించాల్సిన పరిహారం గురించి చర్చించేందుకు శనివారం తన అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా వరి సహా 33 శాతం అంతకు పైగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.13,500 నుంచి

17,000కు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. ఒక వేళ కొబ్బరి లాంటి శాశ్వత పంటలు, చెట్లు లాంటివి దెబ్బతిన్నట్లయితే హెక్టార్‌కు ఇచ్చే పరిహారాన్ని రూ.18,000నుంచి రూ.22,500కు పెంచుతారు. అలాగే వర్షాధార పంటలకు ఇచ్చే సాయాన్ని హెక్టార్‌కు రూ.7.410నుంచి రూ.8,500కు పెంచుతారు. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని కూడా రూ.4 లక్షలనుంచి రూ.5 లక్షలకు పెంచారు. దెబ్బతిన్న గుడిసెలకు ఇచ్చే పరిహారాన్ని కూడా రూ.5 వేలనుంచి రూ.8 వేలకు పెంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News