- Advertisement -
డెహ్రాడూన్: వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. మంచు చరియలు విరిగిపడిన ఘటనకు కారణాలను నిపుణులు తేలుస్తారని, తమ ప్రభుత్వం బాధితులను కాపాడటంపై దృష్టి సారించిందని రావత్ అన్నారు. వరదల వల్ల తపోవన్ విష్ణుగఢ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు నష్టం జరిగిందని ఎన్‌టిపిసి తెలిపింది. అది నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్ట్ అని తెలిపింది. ఆదివారం హిమాలయాల్లో సంభవించిన విపత్తుపై పర్యావరణ బృందాలు స్పందించాయి. సున్నితమైన పర్వత ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాలకు సూచించాయి.
- Advertisement -