Friday, December 20, 2024

50 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పాల్వంచ టౌన్ : పాల్వంచ మున్సిపాలిటి పరిధి ఎర్రగుంటలో అగ్ని ప్రమాదంలో దగ్దమైన పంటకు నష్టం అంచనా వేసి అధికారులు నష్ట పరిహారం అందేలా తగు చర్యలు తీసుకోవాలని పాల్వంచ సహకార సంఘం చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఎంఎల్‌ఏ వనమా ఆదేశాలతో అధికారులతో కలిసి దగ్దమైన మొక్కజొన్న పంటను ఆదివారం పరిశీలించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… చేతికొచ్చిన సుమారు 50 ఎకరాల మొక్కజొన్న పంట అకారణంగా కాలిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు నష్టం విలువ అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం అందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రంగా ప్రసాద్, విద్యుత్ ఏఈ. మధుబాబు, వ్యవసాయ శాఖ ఏఏఓ. భాను , ఆర్‌ఐ. భిక్షమయ్య, రైతులు సాంబశివరావు, మేకా శ్రీనివాస్, రత్నాజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News