- Advertisement -
హైదరాబాద్ : భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి స్పందించక పోవడం చాలా దుర్మార్గమని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ప్రాంతం మునిగిపోయి పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన ఏ మాత్రం స్పందించకుండా మహారాష్ట్రలో రాజకీయాలు చేసేందుకు వెళ్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో చప్పట్లు కొట్టే బ్యాచ్ తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఏ మంత్రికి లేదని ఘాటు విమర్శలు చేశారు. ఒక్కప్పుడు దివి సీమాలో వచ్చిన ఉప్పెన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుందని వరదల వల్ల 33 మంది చనిపోగా, చాలా ఆస్తి నష్టం, రహదారులన్నీ కొట్టుకొని పోయాయని, చెరువులకు గండి పడి పంట నష్టం జరిగిందని ఆయన తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -