Thursday, December 26, 2024

కరక్కాయ బాధితులకు పరిహారం అందజేత

- Advertisement -
- Advertisement -

Compensation to the Karakkaya victims

చెక్కులు అందించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర

మనతెలంగాణ, హైదరాబాద్ : కరక్కాయ మోసం కేసులో బాధితులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అందజేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులకు అందజేశారు. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి రూ.73,53,577 ఆస్తులను వేలం ద్వారా సేకరించారు. వాటిని సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా, ఎల్‌బి నగర్ ఆదేశాలతో సేకరించారు. కరక్కాయ కేసులో 281 మంది బాధితుల కెవైసి వివరాలు సేకరించి వాటిని కోర్టుకు సమర్పించారు. కోర్టు నియమించి కమిటీ బాధితులకు పరిహారం అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి జె. సాంబశివ్, డిసిపి కల్మేశ్వర్ శింగనవార్, డిసిపి కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News