Monday, December 23, 2024

నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం

- Advertisement -
- Advertisement -

వనపర్తి : గ్రామాల అభివృద్ధే లక్షంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్న స్థితి నుంచి గొప్పగా బ్రతకడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో ఏర్పాటు చేసిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం పల్లె ప్రగ తి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోని 9 గ్రామాలు, 6 హాబిటేషన్లలో సుడిగాలి పర్యటన చేసి పల్లె ప్రగతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈ ఒక్కరోజే రూ. 18 .65 కోట్ల రూపాయల అంచనా నిధులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం పెద్దగూ డెం గ్రామ పంచాయతీలో 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. కాంచిరావుపల్లి తాండ, తోమలపల్లి, రంగాపూర్, పెంచికలపా డు, కొత్తసుగురు గ్రామ పంచాయతీల్లో ఒక్కో గ్రా మ పంచాయతికి 20లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. శాఖాపూర్‌లో హెల్త్ సబ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.

పెబ్బేరులో గోదామును ప్రారంభోత్సవం చేశారు. కొత్తసుగుర్ బుర్డిపాడు బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గుమ్మడం గ్రామం నుంచి యాపర్ల గ్రామానికి బిటి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అక్కడే డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. వెం కటాపూర్ నుంచి నాగసానిపల్లి గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. పెబ్బేరులో సహకార సంఘం భవనం, గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పెద్దగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాలను పాలకులు పట్టించుకునే వారు కారని తెలంగాణ వచ్చాక ఈ తొమ్మిది సంవత్సరాల్లో ప్రతి గ్రామ పంచాయతీలలో ప్రజలు గొ ప్పగా బ్రతకడానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. నల్లాల ద్వారా తాగునీరు, ఉదయాన్నే చెత్తబండి వారు వచ్చి చెత్త ఎత్తుకుపోవడం, అందుకు ట్రాక్టర్లు, 24 గంటల విద్యుత్; సాగునీరు, జీవనోపాధికి అనేక సంక్షేమ పథకాలు,- రోడ్లు, గ్రామ పంచాయతీ, క మ్యూనిటీ భవనాలు, సేద తీరడానికి పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు ఇలా అన్ని సదుపాయాలు ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సాగునీటి కాలువ పనులు నడవనివ్వాలని నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఒక్క పెద్దగూ డెం గ్రామంలోనే 552 మందికి ప్రతి నెల 12 లక్ష ల 20 వేల 784 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాల ంలో ఆర్‌అండ్‌బి ద్వారా 40 పనులకు సుమారు 8.50 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రజల కోరిక మేరకు ఒక శిక్షణ, కోచింగ్ సెంటర్ భవనం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మంచి ప్రణాళికతో నాణ్యమైన భవనం నిర్మించాలని, అందుకు తాను మంజూరు చేస్తానని హామి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి పట్టణంలో ఉండే సకల సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల వారికి సం క్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తుందన్నారు. ఈ కా ర్యక్రమంలో ఎంపిపి ఆవుల శైలజ, జెడ్పిటిసి పద్మ, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ, వైస్ చైర్మెన్ కర్రెస్వామి, మాజీ మార్కెట్ చైర్మెన్ గౌని బుచ్చారెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ కోదండ రామిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వనం రాములు, పట్టణ అధ్యక్షుడు దిలీప్ కుమార్ రెడ్డి, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, పంచాయతి రాజ్ ఏఈ రమేష్ నాయుడు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News