అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో
ట్రంప్, హారిస్ మధ్య తీవ్ర పోటీ
భారీసంఖ్యలో ఓటేసిన అమెరికన్లు
ఇద్దరివైపూ సర్వేల మొగ్గు స్వింగ్ స్టేట్స్‌లో
ట్రంప్‌దే ఆధిక్యం డిక్స్‌విల్లేనాచ్‌లో
తొలిఫలితం టై పూర్తి ఫలితాల వెల్లడికి
రెండు,మూడు రోజులు పట్టే అవకాశం
వాషింగ్టన్ : అమెరికాలో తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. దేశంలో నమోదిత ఓటర్లు 16.14 కోట్లు కాగా, వారిలో ఇప్పటటికే సగం మం దికి పైగా (8.2కోట్లు) ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పలు చోట్ల భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అ మెరికాలో ఆయా కాలమానాల ప్రకారం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. కొన్ని రాష్ట్రాల్లో ఉదయం 6గంటలకే మొదలవ్వ గా మరికొన్ని రాష్ట్రాల్లో 8గంటలకు ప్రారంభమైంది. మరోవైపు అధ్యక్ష పదవి కోసం డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ల తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు.
ఇద్దరి నడుమ పోరు హోరాహోరీగా సాగుతున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. సర్వేలు కూడా ఆఖరి గంట వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరువురు ప్రచారాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్న స్వింగ్ రాష్ట్రాలపైనే ఇద్దరూ దృష్టి కేంద్రీకరించారు. చివరిదశలో పెన్సిల్వేనియాలో కమలా హా రిస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇదిలావుండగా ‘ది హిల్’ సర్వే ప్రకారం హారిస్ వైపు 48శాతం మొగ్గు కనపడుతుండగా.. ట్రంప్ వైపు 48.7శాతం మంది ఉన్నట్లు తేల్చిం ది. అదే విధంగా స్వింగ్ స్టేట్స్‌లో నాలుగింట ట్రంప్ ఆధిపత్యాన్ని చాటుతున్నారని మరో సర్వే వెల్లడించింది.
మిగతా మూడింటిలోని రెండు రాష్ట్రాలు హారిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది. కాగా పోలింగ్ గురు ‘ఫైవ్ థర్టీ యై ట్’ మాత్రం గురువారం అర్ధరాత్రి తరువాత సర్వే ఫలితాలు ప్రకటించింది. ముందు రోజు వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్న చోట కమల క్రమంగా పుంజుకున్నట్లు తెలిపింది. హారిస్ గె లుపునకు 50.2శాతం అవకాశాలున్నాయని వివరించింది. యాహూ న్యూస్ ఇద్దరికీ 47శాతం గెలుపు అవకాశాలున్నట్లు వెల్లడించింది. పిబిఎస్ న్యూస్‌మారిస్ట్ న్యూస్ కమల తదుపరి అధ్యక్షురాలని తేల్చింది. ఎకానమిస్ట్‌యూగవ్ హా రిస్‌కు 3శాతం ఆధిక్యాన్ని కట్టబెట్టింది. కాగా మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కమల విజయం సాధిస్తే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అ ధిరోహించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.
లేదంటే మరోసారి ట్రంప్‌వైపే అమెరికన్లు మొగ్గు చూపుతారా అన్నది యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇక పోలింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే అమెరికాలోని ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్ కూడా పూర్తయింది. న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వెల్లడైంది. అక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు ఉం డగా, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మూడు, రిపబ్లికన్ అభ్యర్థి డొ నాల్డ్ ట్రంప్‌కు మూడు ఓట్లు వచ్చాయి. 2020లో మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ వైపు డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించడం విశేషం. డిక్స్‌విల్లే నాచ్ అమెరికాకెనడా సరిహద్దులో ప్రదేశం. ఇక్కడ ప్రస్తుతం ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉండగా, నలుగురు రిపబ్లికన్ పార్టీ తరఫున నమోదు చేసుకున్నవారు. మ రో ఇద్దరు మాత్రం ఏ పార్టీ తరఫున నమోదు చేసుకోలేదు. ఎలక్షన్ డే మొ దలైన తర్వాత వీరంతా స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించాక ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటేసిన 15 నిమిషాల తరువాత ఫలితాలు ప్రకటించారు.
ఆఖరి రోజు ఎవరెక్కడ?
సుమారు రెండు మాసాల పాటు ఎన్నికల ప్రచారంలో ట్రంప్, హారిస్ బిజీబిజీగా గడిపారు. ఆఖరి రోజు మాత్రం ట్రంప్ ఫ్లోరిడాలో ఓటు వేస్తారు. ఆ తర్వాత దగ్గర్లోని మార్‌ఎలాగో ఎస్టేట్‌లో విశ్రాంతి తీసుకోనున్నారని సమాచారం. అనంతరం విందులో పాల్గొననున్నారు. హారిస్ ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత రాష్ట్రం కాలిఫోర్నియాలో ఇ మెయిల్ ద్వారా ఆమె ఓటు వేశారు. హార్వర్డ్ వర్శిటీ పూర్వ విద్యార్థి అయిన ఆమె విశ్వవిద్యాలయంలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
5వేల మంది న్యాయవాదుల నియామకం
ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే న్యాయపరమైన పోరాటానికి కూడా ట్రంప్ ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం 5వేల మంది న్యాయవాదులను నియమించుకునారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్ష, అవకతవకలపై పరిస్థితులను బట్టి న్యాయస్థానాలను ఆశ్రయించాలని భారీ ఎత్తున లాయర్లను అందుబాటులో ఉంచుకున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలపై కూడా ట్రంప్ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఫలితాలకు సమయం పట్టే అవకాశం
ట్రంప్, కమల నడుమ హోరాహోరీ ఎన్నికల పోరు జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. పోలింగ్ ముగిసిన వెంటనే భారత కాలమానం ప్రకారం బుధవారంనాడు ఉదయం 4గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తుది ఫలితాలు కొంత ఆలస్యంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికాలో పోలింగ్ ముగిసిన వెంటనే గంటల వ్యవధిలోనే ఫలితాల సరళి, తుది ఫలితాలు వెలువడేవి.
క్రమంగా అభ్యర్థుల నడుమ హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ కూడా కొంత క్లిష్టంగా మారింది. విజేతల నడుమ స్వల్ప తేడాల కారణంగా రీకౌంటింగ్ జరపాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీనితో పాటు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కాలమానం కారణంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియలో కూడా తేడాలు ఉంటున్నాయి. తుది ఫలితం వెలువడేందుకు ఈసారి రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్వింగ్ స్టేట్స్ విజేతను తేల్చే పరిస్థితి స్పష్టమైతే ఓట్ల లెక్కింపు మరింత ఉత్కంఠకు దారితీయనుంది. కాగా 2020 ఏడాదిలో ఎన్నికలు నవంబర్ 3న జరుగగా.. విజేతగా జో బైడెన్‌ను నవంబర్ 7న ప్రకటించాల్సి వచ్చింది. అంటే కౌంటింగ్ ప్రక్రియ ముగియడానికి కనీసం నాలుగు రోజులు పట్టింది.