Wednesday, January 22, 2025

గెలుపు గుర్రాలు ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఎన్నికల్లో కచ్చితంగా గెలి చే అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. సిట్టింగ్‌లు, కొత్త అభ్యర్థులు అనే తేడా లేకుండా పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలు సర్వేలు చేయించుకుంటూ ఆచితూచి వ్యవహరిస్తున్నా యి. దాదాపు మరో ఐదు నెలల్లో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు అభ్యర్థు ల ఎంపికనే పెద్ద సవాల్. గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇస్తే ఆ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈ నేపథ్యం లో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపైన దృష్టి సారించా యి.పార్టీలలో జిల్లాల వారీగా, నియోజకవర్గాలవారీగా కమిటీలు నియమించి ఎప్పటికప్పుడు కార్యకర్తల అభిప్రాయాలను, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు రహస్యంగా స ర్వేలు చేయిస్తున్నాయి.

టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారనే అభ్యర్థుల కోసమే పా ర్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థులు కూడాఎవరికి వారే తమకే సీటు వస్తుందని భావించి నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఇప్పుడే ఎన్నికల వేడి మొదలయినట్లు కనిపిస్తోంది. కొన్ని పార్టీలలో టికెట్ల కోసం అభ్యర్థుల మధ్య తీవ్రస్థాయలో పోటీ ఉండగా, మరికొన్ని పార్టీలకు అభ్యర్థులు దొరకకపోవడం విశేషం. పలానా పార్టీ టికెట్ వస్తే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్న పార్టీలలో అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే మరికొన్ని పార్టీలలో టికెట్ లభించినా ఓడిపోతామని భావిస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చు తమకు భారంగా మారుతుందని, తమకు టికెట్ వద్దని చెబుతున్నట్లు తెలుస్తోంది.
టికెట్ల కోసం బిఆర్‌ఎస్‌లో పోటాపోటీ
తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి బి ఫాం లభిస్తే కచ్చితంగా ఎంఎల్‌ఎ అయిపోయినట్లే అనే భావన ఏర్పడింది. దాంతో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంఎల్‌ఎ టికెట్ ఆశించే ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా నియోజకవర్గాలలో సిట్టింగ్‌లతో పాటు ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికపై బిఆర్‌ఎస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో బిఆర్‌ఎస్ టికెట్లు ఆశించే అభ్యర్థులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్‌లకు ప్రాధాన్యమిస్తామంటూనే.. అవసరమైన చోట మార్చక తప్పదని గులాబీ దళపతి సంకేతాలు ఇవ్వడంతో.. నాయకుల్లో హడావిడి పెరిగింది.

20 నుంచి 30 స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ఖాయమంటూ పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పనితీరు సరిగ్గా లేని వారిని మార్చక తప్పదని పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మళ్లీ టికెట్ తమకేనని ప్రస్తుత శాసనసభ్యులు ఆశిస్తుండగా.. ఈసారి తమకే అవకాశమంటూ మిగతా ఆశావహులు ప్రచారం చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీ అదినేత కెసిఆర్‌ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను, ఇతర ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునేందుకు సిట్టింగ్‌లతో పాటు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పార్టీలలో టికెట్ల సందడి
ఎన్నికలకు ఇప్పటికే రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలలో టికెట్ల సందడి జోరుగా సాగుతోంది. నియోజకవర్గాలవారీగా వివిధ హోదాలలో పనిచేసిన వారు తమకే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. టికెట్ లభించని పక్షంలో ఇతర పార్టీ నుంచి టికెట్ లభిస్తే పార్టీ మారేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే కొన్ని పార్టీలకు చెందిన నేతలు అంతర్గతంగా అభ్యర్థులను ఖరారు చేసి వారి వారి నియోజకవర్గాలలో పనిచేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టికెట్ ఖరారైనట్లు పార్టీ ప్రకటించకపోయినా అభ్యర్థులు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. గ్రామాలు, మండలాల వారీగా కమిటీలను,

నమ్మకంగా పనిచేసే కార్యకర్తలను సిద్ధం చేసుకుంటూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దాదాపు ఏడాది నుంచే పలు నియోజకవర్గాల్లో నేతలు వర్గాలుగా విడిపోయి పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని.. టికెట్ ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవైపు తమ బలాన్ని ప్రదర్శిస్తూ… అనుకూల అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూనే.. మరోవైపు పార్టీలో ప్రత్యర్థుల బలహీనతలను, లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే పార్టీ మారేందుకు సిద్ధమేనంటూ కొందరు పరోక్ష హెచ్చరికలను పంపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News