Monday, December 23, 2024

సగం స్థానాల్లో పోటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సన్నాహాలను సైతం ప్రారంభించిం ది. గురువారం న్యూఢిల్లీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీల క సమావేశంలో ఎ న్నికల వ్యూహం, మేనిఫెస్టో, సీట్ల పంపిణీ అంశాలపై చర్చించింది. అఆగే రాహుల్ గాంధీ త్వరలో చేపట్టనున్న భారత్ జోడో న్యాయయాత్ర రూట్ మ్యాప్‌ను సైతం ఖరారు చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియ ర్ నేతలు, పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నేత లు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ తమ విభేదాలను పక్కన పెట్టి ఒక్కటిగా పని చేయాలని, సున్నితమైన అంశాలపై పార్టీ వైఖరికి భిన్నంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నేతలకు హితవు చెప్పారు. మొత్తం లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలున్న్ల దాదాపు సగం స్థానాలపై పూర్తి బలంతోస్థాయిలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్త సీట్లలో సగం స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్న ట్లు కూడా వారు చెప్పారు. ఈ వారంలోనే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీలను కూడా పార్టీ ప్రకటించే అవకాశం ఉందని, ఆ వెంటనే అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కూడా ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, అతి త్వరలోనే పార్టీ తన తొలి జాబితాను ప్రకటిస్తుందని కూడాఆ వర్గాలు తెలిపాయి. మరో వైపు పార్టీ మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి కూడా చర్చలను ప్రారంభించింది. దీనికి సంబంధించి ఏర్పాటయిన కమిటీ సమావేశమై మేనిఫెస్టోలో చేర్చాల్సిన కీలక అంశాలపై చర్చించింది. అలాగే సీట్ల పంపిణీపై ఏర్పాటయిన పార్టీ కమిటీ కూడా ఖర్గే నివాసంలో ఆయనతో తుది చర్చలు జరిపింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ముకుల్ వాస్నిక్ కన్వీనర్‌గా, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోట్, భూపేశ్ బాఘెల్‌లు సభ్యులు గా ఉన్న ఈ కమిటీ పార్టీ అధినాయకత్వానికి దీనిపై ఎలా ముందెకెళ్లాలో సూచనలు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఇతర పార్టీలతో సీట్ల పంపిణీకి సం బంధించి అన్ని రాష్ట్రాల పార్టీ విభాగాలతో చర్చించింది కూడా. సమావేశం ప్రారంభంలో ఖర్గే మాట్లాడుతూ గత పదేళ్లలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బిజెపి ఉద్వేగాలను రెచ్చగొట్టే అంశాలను లేవనెత్తుతోందని విమర్శించారు. ఆ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రతి అంశాన్ని కాంగ్రెస్ పార్టీతో ముడిపెడుతోందన్నారు. మనం ఒక్కటిగా మారి ఈ అబద్ధాలను, బిజెపి మోసాలను, తప్పులను ప్రజల ముందు గట్టిగా ఎండగట్టాలని ఖర్గే పిలుపునిచ్చారు. తమ విభేదాలను మరిచిపోవాలని, అంతర్గత విషయాలను మీడియా లో ప్రస్తావించవద్దని, ఒక టీమ్‌గా పని చేయాలని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పాతికేళ్ల పాటు సోనియా గాంధీ అం దించిన సేవలను, అలాగే భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీని ఖర్గే కొనియాడారు. ఇప్పుడు ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలోని మన కార్యకర్తలు అంకిత భావంతో పని చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కూడా పిలుపునిచ్చారు.
ప్రజలను లూటీ చేస్తున్న మోడీ ప్రభుత్వం
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోయినప్పటికీ దేశంలో మోడీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. గడచిన 19 నెలల్లో ముడి చమురు ధరలు 31 శాతం తగ్గాయంటూ గణాంకాలతో కూడిన పట్టికను ఆయన సా మాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే సంబంధిత మంత్రి మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రసక్తి లేదంటూ ప్రకటిస్తున్నారని ఖ ర్గే తెలిపారు. ముడి చమురు ధరలు పడిపోతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం సా గిస్తున్న లూటీపై నియంత్రణ లేకుండా పోయిందని ఆయన తెలిపారు. ధరల తగ్గింపుపై చమురు కంపెనీలతో చర్చలు జరపడం లేదని మోడీ ప్రభుత్వం లోని మంత్రులే స్వయంగా చెబుతున్నారని ఆయన చెప్పారు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8 నుంచి రూ.10, డీజిల్‌పై రూ. 3 నుంచి రూ. 4 చొప్పున ప్రజల నుంచి చమురు కంపెనీలు లాభాలు గడిస్తున్నాయని ఆయన తెలిపా రు. గడచిన 50 ఏళ్లలో న్నడూ లేని విధంగా దేశంలో ప్రజల పొదుపు ఖాతా లు దారుణంగా క్షీణించాయని, బిజెపి చెబుతున్నఅచ్చే దిన్ వారి బూటకపు ఉపన్యాసాలు, డొల్ల ప్రకటనలలోమాత్రమే కనపడుతోందని ఖర్గే విమర్శించారు.
రాహుల్ పాదయాత్ర పేరులో స్వల్ప మార్పు
కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14నుంచి మణిపూర్‌నుంచి ముంబయి వరకు చేపట్టనున్న పాదయాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా పేరు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది.గురువారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జిలు, పిసిసి అధ్యక్షుల సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ విషయం తెలియజేసారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ యాత్ర రూట్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు ఈ యాత్రకు భారత్ న్యాయ యాత్రగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఇంతకు ముందు కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ యాత్ర పార్టీకి మంచి ఊపునిచ్చింది. యాత్ర తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పుడు దక్షిణ భారత దేశంనుంచి ఉత్తర భారతానికి యాత్ర చేపట్టగా ఇప్పుడు తూర్పునుంచి పడమరకు భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టనున్నారు. పార్టీ విడుదల చేసిన రూట్ ప్రకారం ఈ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక రోజులు అంటే 11 రోజుల పాటు 1,074 కిలోమీటర్ల మేర సాగనుంది.

Bharat Yatra

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News