Monday, December 23, 2024

ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

- Advertisement -
- Advertisement -

Competitions in various sports in February in honor of CM KCR birthday

శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురుస్కరించుకుని ఫిబ్రవరిలో వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర క్రీడా ప్రాధికారి సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 17న సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏడు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్‌లోని ఎల్.బి.స్టేడియం వేదికగా ఈ పోటీలు జరుగుతాయన్నారు. కబడ్డీ, హ్యాండ్‌బా, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పోటీలుంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1300 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారన్నారు. ఫిబ్రవరి 14న ప్రారంభమయ్యే క్రీడలు 17న ముగుస్తాయన్నారు. ఇక పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చైర్మన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News