ఇందల్వాయి : ఏడు నెలలుగా ఇందల్వాయి మండలంలోని మేగ్యానాయక్ తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్లు విధులు నిర్వహిస్తున్న కవిత వ్యక్తిగత కారణాలతో గ్రామంలో నివసించడంలేదని దీంతో ఆమె నిర్వహిస్తున్న సబ్ సెంటర్ ఏడు మాసాలుగా తాళంవేసి ఉందని తాండావాసులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఏడు నెలలుగా విధులకు హాజరుకాని టీచర్ కవితపై కఠిన చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేంద్రం పరిధిలోని చిన్న పిల్లలకు గుడ్లు, పాలు, పోషకాహారం ఇవ్వడంలో నిర్లక్షం జరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలకు సైతం గుడ్లు, పోషకపదార్థాలు అందించే నాథుడే లేరని గిరిజనులు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈ విషయ మై ఐసిడిఎస్ అధికారికి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా తమనే బెదిరిస్తూ, మీ అందరిపై కఠిన చర్యలు తీసుకుంటా, కేసులు కూడా పెట్టిస్తానని బెదిరించడంతో గ్రామస్తులు జం కు తున్నారు.
అంగన్‌వాడీ టీచర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -