- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్‌పై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు నమోదైంది. ఇండియా-ఆస్ట్రేలియా గేమ్ టిక్కెట్లు అవినీతికి పాల్పడి అమ్ముకున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్ ఆరోపించారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌తో పాటు మరికొందరు హెచ్‌సీఏ సభ్యులు టిక్కెట్ల అనధికారిక విక్రయానికి పాల్పడ్డారని యుగంధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్ తో పాటు హెచ్‌సీఏ నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో గాయపడిన ప్రతి వ్యక్తికి 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు.
- Advertisement -