Thursday, January 23, 2025

కార్పొరేటర్ నవీన్‌కుమార్‌పై అధిష్ఠానంకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : జవహర్‌నగర్‌లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న 25వ డివిజన్ కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్‌కుమార్‌పై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేయనున్నట్లు బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బల్లి శ్రీనివాస్‌గుప్తా తెలిపారు.ఈ మేరకు సోమవారం 3వ డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జవహర్‌నగర్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 225,226 స్థలంకు తనకు ఎటువంటి సంబంధం లేకపోయిన ఆదివారం కార్పొరేటర్ నవీన్‌కుమార్ కొంత మంది వ్యక్తులను ఆ స్థలం వద్దకు తీసుకొచ్చి కార్పొరేటర్ బల్లి రోజా భర్త బల్లి శ్రీనివాస్ కబ్జా చేస్తున్నాడని మీడియా వద్ద మాట్లాడటం జరిగిందని తెలిపారు.అయితే ఆ స్థలంకు తనకు ఎలాంటి సంబంధం లేకపోయిన తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తు తనపై దృష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డాడు.ఒకే పార్టీలో ఉంటునే తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేకనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలిపాడు.కార్పొరేటర్‌గా ఉంటూ జవహర్‌నగర్‌లో కొంత మంది వ్యక్తులతో కలిసి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు అతనిపై అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.అటువంటి వ్యక్తి తన ఎదుగుదలను జీర్ణించుకోలేకనే తనను విమర్శించడం దురదృష్టకరమన్నారు. ఆతనిపై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేయడమే కాకుండా క్రిమినల్ చర్య తీసుకోనున్నట్లు తెలిపారు.పరువు నష్టం దావా వేయనున్నట్లు బల్లి శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News