న్యూస్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై ఫిర్యాదు చేసేందుకు తనకు ఢిల్లీ పోలీసుల ఆన్‌లైన్ అడ్రస్ కావాలంటూ ట్వీట్ చేసిన పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీకి ఢిల్లీ పోలీసులు గట్టి జవాబే ఇచ్చారు. మంగళవారం సెహర్ షిన్వారీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ట్వీట్ పోస్టు చేశారు. ఢిల్లీ పోలీసుల ఆన్‌లైన్ లైఇంక్ ఎవరికైనా తెలుసా? నాదేశం పాకిస్తాన్‌లో అల్లర్లను, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత నిఘా ఏజెన్సీ రాపై నేను ఫిర్యాదు చేయదలిచాను. భారతీయ న్యాయస్థానాలు స్వేచ్ఛగా(అవి చెప్పుకుంటున్నట్లు) పనిచేస్తున్నట్లయితే భారతీయ సుప్రీంకోర్టు నాకు తప్పనిసరిగా న్యాయం చేస్తుంది&అంటూ ఆమె ట్వీట్ చేశారు.
కాగా..దీనికి ఢిలీ పోలీసులు వెంటనే స్పందించారు. పాకిస్తాన్ మా పరిధిలోకి ఇంకా రాలేదు. మీ దేశంలో ఇంటర్‌నెట్ మూతపడినప్పటికీ నువ్వు ఎలా ట్వీట్ చేస్తున్నావో తెలుసుకోవాలని భావిస్తున్నాము అంటూ ఢిల్లీ పోలీసులు చెణుకులు విసిరారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అక్కడి పోలీసులు అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసిన దరిమిలా ఆ దేశంలో హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఇంటర్‌నెట్ కూడా షట్‌డౌన్ అయింది.
Also Read: ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..