Monday, December 23, 2024

రాహుల్,రేవంత్‌లపై ఎన్‌హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Complaint against Rahul and Revanth in NHRC

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తుందని న్యాయవాది రామారావు ఆరోపించారు. కాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు దర్యాప్తు చేయనుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌వీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టిఆర్‌ఎస్‌వి నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. ఒయూలో రాహుల్ గాంధీ అడుగుపెడితే అడ్డుకుంటామని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతే రాహుల్ ఒయూకు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఏనాడూ గుర్తుకు రాని ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితి తేవొద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News