Friday, January 17, 2025

మహిళా పిఎస్‌లో చిన్నశ్రీశైలం కోడలు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

తండ్రి, కుమారుడు వేధిస్తున్నాడని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు

మనతెలంగాణ, సిటిబ్యూరోః తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని చిన్నశ్రీశైలం యాదవ్ కోడలు సైబరాబాద్ షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. చిన్నశ్రీశైలం యాదవ్ చిన్న కుమారుడు వెంకట్‌కు తనకు వివాహమైందని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అదనపు కట్నం కోసం చిన్న శ్రీశైలం, అతడి కుమారుడు వెంకట్ కలిసి వేధించడమేకాకుండా క్రికెట్ బ్యాట్‌తో కొట్టారని, ఇస్త్రీ పెట్టెతో కాల్చినట్లు ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి వేధిస్తున్నారని తెలిపారు. వారి వేధింపులు భరించలేక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News