Saturday, December 21, 2024

ఇండియా పేరు అనుచితం ..ఢిల్లీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్షాల సంఘటిత కూటమి పేరు ‘ఇండియా’ వివాదాస్పదమైంది. దేశానికి సంబంధించిన ఇండియా అనే పేరును కూటమికి వాడుకోవడం అనుచితం అని దేశ రాజధానిలోని బారాకంబ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు అయింది. 26 ప్రతిపక్ష పార్టీలపై అవినాష్ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ పేరు పెట్టుకున్న పార్టీలపై చర్యలు తీసుకోవాలని మిశ్రా కోరారు. కూటమికి ఇండియా పేరు పెట్టడం ఎన్నికలలో దేశం పేరు తీసుకురావడం అవుతుంది. అనుచిత ప్రభావానికి దారితీస్తుందని పేర్కొన్నారు. బెంగళూరులో మంగళవారం జరిగిన విపక్ష సమావేశాలలో యుపిఎ పేరు మార్చి ఇండియా పేరు పెట్టారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఈ పేరు ప్రతిపాదించారు. దీనికి ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. దేశ విధానాలపై దాడికి దిగుతున్న బిజెపి సారధ్యపు ఎన్‌డిఎపై పోటీకి ఇండియాను ఏర్పాటు చేసినట్లు ప్రతిపక్షాలు ప్రకటించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News