Thursday, December 26, 2024

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్యకు షాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్న బెల్లంపల్లి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎకు ఆ విషయంలో మరో షాక్ తగిలింది. బాధితురాలు అయిన శేజల్ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో తాజాగా వారు స్పందించారు. ఎంఎల్‌ఎపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని జాతీయ మహిళా కమిషన్ అధికారులు తెలంగాణ డిజిపికి లేఖ రాశారు. శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. మరో 15 రోజుల్లో దీనిపై అప్‌డేట్ ఇవ్వాలని కమిషన్ సదరు లేఖలో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News