Saturday, November 23, 2024

సిఎం పై అనుచిత వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైంలో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Complaint in cyber crime against Teenmar Mallanna

పద్దతి మారకుంటే క్యూన్యూస్‌పై దాడీ చేస్తాం
టిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ క్రిశాంక్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌పై సోషల్ మీడియా వేదికగా తీన్మార్ మల్లన్న అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసున్నారంటూ టిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మంగళవారం నాడు సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ వృత్తిని అడ్డుపెట్టుకొని యూట్యూబ్ అడ్డాగా సిఎం కెసిఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కన్వీనర్ క్రిశాంక్ అభ్యంతరం వ్యక్తం చేశారు.తనపై నమోదైన కేసుల నుండి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేయాలని సైబర్ క్రైం ఎసిపిను కోరినట్లు తెలిపారు. ఇప్పటికైనా మల్లన్న తన వైఖరిని మార్చుకోకపోతే క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసేందుకు కూడా వెనుకాడమని ఆయన హెచ్చరించారు.

ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా మల్లన్నపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఏసీపీని వారు కోరారు. కాగా, తీన్మార్ మల్లన్న కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల మొదట్లో నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సి ఆర్ పి ఎస్ 41ఎ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు. పీర్జాదిగూడ లోని సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ పంపనున్నారు. నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News