Monday, December 23, 2024

బడి డుమ్మా.. ఉపాధ్యాయుడిపై ఎంఈవోకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

 

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జిటి ఉపాధ్యాయునిగా పని చేస్తున్న గులాం రబ్బానీపై శుక్రవారం ఎంఈవో నాగ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. తెరాస నాయకులు ఎంఎ. రజాక్ లిఖిత పూర్వకంగా ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు రాకుండానే హాజరు పట్టిలో సంతకాలు పెట్టి ఇతర ఉపాధ్యాయులతో పనులు చేయిస్తున్నారన్నారని ఆరోపించారు. పాఠశాలకు రాకుండా ప్రైవేట్ పనులు చేసుకుంటున్నారని, ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. విధులకు డుమ్మా కొడుతున్న గులాం రబ్బానీ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. లేనట్లుయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. విచారణ జరిపి ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తామని ఎంఈవో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News