Sunday, December 22, 2024

నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

సినీ హీరో అక్కినేని నాగార్జున షాక్ తగిలింది. ఆయనపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోవైపు, మంత్రి కొండా సురేఖపై నాగార్జున.. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టులో దావా వేశారు నాగార్జున. అయితే, న్యాయవాదులు సెలవుల్లో ఉండటంతో కేసు విచారణ వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News