Monday, December 23, 2024

వైఎస్ షర్మిలపై స్పీకర్‌కు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Complaint to Speaker against YS Sharmila

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రులు నిరంజన్‌రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, పలువురు ఎంఎల్‌ఎలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదుల చేశారు. షర్మిల్ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంఎల్‌ఎలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టసభల ప్రతినిధులు అనే స్పృహలేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా షర్మిల్ అవమానిస్తున్నారని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార, జుగుప్సాకర ఆరోపణలు చేసినందుకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా పరిగణిస్తామని, ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. వైయస్ షర్మిలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో ఎంఎల్‌ఎలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News