Tuesday, December 24, 2024

కులం పేరుతో దూషించిన వ్యక్తులపై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: కులం పేరుతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మాదాసి రాజేందర్ తెలిపారు. పాత మగ్ధుంపురం గ్రామానికి చెందిన మాదాసి రాజేందర్ సోమవారం సాయంత్రం గ్రామంలోని పఠాన్ నాగులు కిరాణం షాపు వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న పోలెపల్లి రమేశ్, నాంపల్లి మల్లయ్యలు గ్రామసభలో దళిత బంధు, బీసీ బంధు గురించి బాగా మాట్లాడుతున్నారని కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన అన్న దేవరాజుకు వివరిస్తుండగా మళ్లీ ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని తనను దూషిస్తూ తనపై దాడి చేశారని, వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఎస్సై మహేందర్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రాజేందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News