న్యూఢిల్లీ: ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఇటీవల ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ అనే పుస్తకాన్ని రాశారు. బుధవారం జరిగిన ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రముఖ నాయకులు పి. చిదంబరం, దిగ్విజయ్ సింగ్ కూడా హాజరయ్యారు. అయితే ఆ పుస్తకంలో ‘హిందూత్వంను ముస్లిం తీవ్రవాద సంస్థలైన ఐఎస్‌ఐఎస్, బోకో హరామ్ వంటి సంస్థలతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. దాంతో ఢిల్లీ కి చెందిన ఇద్దరు న్యాయవాదులు వివేక్ గర్గ్, వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో సల్మాన్ ఖుర్షీద్ హిందుత్వను అపఖ్యాతి పాలుచేస్తున్నట్లు ఫిర్యాదులు దాఖలుచేశారు.
పుస్తకంలోని ‘ద సాఫ్రాన్ స్కై’ అనే అధ్యాయంలో సల్మాన్ ఖుర్షీద్ ఋషులు, సాధువులకు ప్రసిద్ధమై సనాతన ధరం, సాంప్రదాయ హిందూమతంను ప్రక్కకి తోసేసి తీవ్ర సంస్కరణతో కూడిన హిందూత్వం చోటుచేసుకుందని, వాటి ప్రమాణాలు ఇస్లాం జిహాద్‌ను పాటించే ఇటీవల గ్రూపులైన ఐఎస్‌ఐఎస్, బోకో హరామ్‌లకు సమానమంటూ పోల్చారు.
సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంపై ఫిర్యాదులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -