- మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని
మెదక్ : ఫిర్యాదిదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా ఎస్పి ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దశంకరంపేట మండలం శివాయపల్లి గ్రామానికి చెందిన దండు భూదమ్మ తమ గ్రామానికి చెందిన తమ పాలివారు గతంలో చేను వద్ద జరిగిన గొడవలలో వారిపై మూడు కేసులు నమోదు అయ్యాయని అప్పటినుంచి మాపైన కక్షగట్టి నన్ను నా కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా పలుమార్లు మాపైకి గొడ్డల్లు, కర్రలతో దాడి చేయడానికి పొలాల వద్ద వేచి చూస్తున్నారని కావున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని పెద్దశంకరంపేట ఎస్‌ఐకి సూచనలు చేశారు.
అలాగే మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామానికి చెందిన సుగుణ తమ గ్రామ శివారులో సర్వే నంబర్ 143/ఆ2లో 20 గుంటల భూమిని జవాన్ బుజ్జిగారి నుంచి ఖరీదు చేసి ఈ భూమికి ఇవ్వవలసిన డబ్బులు మొత్తం ఇచ్చి నలుగురు పెద్దమనుషుల సమక్షంలో ప్రభుత్వ చలానా కట్టి వారి నుంచి 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఆ భూమి నా కూతురు పెళ్లి కుదిరినందున ఆ అవసర నిమిత్తం అమ్ముకున్నాను. ఈ భూమి నేను లేని రోజు చూసి 22-/04/-2023న సరిహద్దులను కొందరు వ్యక్తులు తీసేశారు. మరుసటి రోజు నేను 23-/04-/2023 వారిని పదిమంది సమక్షంలో అడగగా అవును తీసేశామని ఏమిచేస్తావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని భయబ్రాంతులకు గురిచేసి మమ్మల్ని సంవత్సరం నుంచి నానా రకాలుగా బెదిరిస్తున్నారని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని చేగుంట ఎస్సైకి సూచించారు. ఈ రోజు జిల్లా నలుములల నుంచి పలు ఫిర్యాదిదారులు రావడం జరిగింది.