Monday, December 23, 2024

ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ః ప్రతి సోమవారం ఎస్పి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పది మంది ఫిర్యాదుదారులు వచ్చారని ఎస్పి కార్యాలయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పి కె. మనోహర్ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అనంతరం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.

సోమవారం వచ్చిన ఫిర్యాదులలో భర్త వేధింపులపై ఒక ఫిర్యాదు, డబ్బు తీసుకుని ఇవ్వడం లేదని ఒక ఫిర్యాదు, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఒకటి, ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఒకటి, బ్యాంకు లోన్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై ఒకటి, ఇరువర్గాల గొడవకు సంబంధించి ఒకటి, భూ తగాదా గురించి నాలుగు ఫిర్యాదులు వచ్చాయని ఎస్పి కార్యాలయ పిఆర్‌ఓ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News