కొత్తగూడ: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించాలని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని మహబూబాబాద్ డీఎస్పీ రమణబాబు అన్నారు. మంగళవారం కొత్తగూడ పోలీస్‌స్టేషన్‌ను మహబూబాబాద్ డీఎస్పీ రమణబాబు సందర్శించారు. ఈ సందర్శనలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారికి తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రమణబాబు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించాలని, పోలీస్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ధైర్యాన్ని కల్పించాలన్నారు. అదే విధంగా గ్రామాలను సందర్శిస్తూ ప్రజలను మోటివేట్ చేస్తూ మావోయిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తూ ప్రభావంతంగా పనిచేయాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సీహెచ్ నగేష్, సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.