Thursday, January 23, 2025

ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచరాదని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా ఎస్పి రక్షిత కె మూర్తి అన్నారు. పానుగల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్సై ఎస్పికి వివరించారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ ప్రతి రోజు పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, విధుల పట్ల అంకితభావంగా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని అన్నారు. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు.

పోలీస్ స్టేషన్‌లో వర్టికల్స్ నిర్వహణ, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఆనైలైన్ వినియోగించు విధానం, టిఎస్ కాప్స్, సిసిటిఎన్‌ఎస్, ఆన్లైన్‌లో కేసుల వివరాలు నమోదు చేయు మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పిటిషన్‌ను ఆన్లైన్‌లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరు అవగాహణ కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి రోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరతగతిన పూర్తి చేయాలని తెలిపారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల పెండింగ్‌లో ఉంచరాదని, సంబంధించిన ధృవపత్రాలు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యుషన్ కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవి ప్రకాష్, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News