Wednesday, January 22, 2025

ప్రజా పాలనకు ఏర్పాట్లు పూర్తి చేయండి

- Advertisement -
- Advertisement -

సమీక్ష సమావేశంలో ముఖ్య కార్యదర్శి దానకిశోర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజాపాలనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఇందులో భాగంగా ఈ నెల 28 నుండి ప్రారంభంకానున్న వార్డు సభలకు సన్నద్ధం కావాలని మున్సిపల్ , పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఆదేశించారు. సోమవారం మునిసిపల్ కమిషనర్‌లతో ప్రజా పాలన సన్నద్దతపై ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఓఆర్ఆర్ పరిధిలోని కమిషనర్లు ప్రత్యక్షంగాను , మిగిలినవారు జూమ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన, వార్డ్ సభలకు ఏర్పాటు చేయాలని, టీం లను ఏర్పాటు పూర్తి చేయాలని సుచించారు. దరఖాస్తులను స్వీకరించడం, వాటికి రసీదు ఇవ్వడం, వాటిని కంప్యూటరైజ్ చేయడం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డు సభల తేదీలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అన్నారు. వార్డు సభల్లో ప్రజాప్రతినిధుల ను బాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం పై రోజు వారీ నివేదిక రాష్ట్ర కార్యాలయనికి పంపిచాలని , దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షలో సిడిఎంఏ హరిచందన, జెడిలు కృష్ణ మోహన్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News