Tuesday, January 28, 2025

ఆ రోజున ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: రథసప్తమి సందర్భంగా తిరుపతిలో సర్వదర్శనం కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ నెల 31 న పాలక మండలి రథ సప్తమి ఏర్పాట్లపై టిటిడి సభ్యులు, అధికారులతో సమీక్ష జరపనున్నారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్ల రద్దుపై ఇప్పటికే ప్రకటన ఇచ్చామన్నారు. ఫిబ్రవరి 4 న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపి దర్శనాలు రద్దు చేస్తామని తెలియజేశారు. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారి దర్శనం జరగనుందని టిటిడి చైర్మన్ పేర్కొన్నారు. గతంలో తిరుపతిలో  వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News