యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థ ఆర్‌జి2 ఏరియాలోని ఓసిపి3 ప్రాజెక్టులో చేపట్టిన అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్‌జి2 జిఎం ఎ మనోహర్ సివిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సివిల్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఓసిపి3 ప్రాజెక్టు విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు, బేస్‌వర్క్‌షాప్ తరలింపు పనులు, అన్ని సెక్షన్‌లకు షెడ్‌ల నిర్మాణ పనులను సివిల్ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో జిఎంకు వివరించారు.
పెడింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. యంత్రాల మరమ్మత్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆర్‌వో ప్లాంట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొని వచ్చిన సివిల్ అధికారులను అభినందించారు.
సమావేశంలో ప్రాజెక్టు అధికారులు మధుసూదన్, కె శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఒటుజిఎం బచ్చ రవీందర్, సివిల్ డిజిఎం ధనుంజయ, ఐఇ మురళీకృష్ణ, ప్రాజెక్టు ఇంజనీర్ విజయ్‌కుమార్, గ్రూపు ఇంజనీర్ చంద్రశేఖర్, స్టోర్స్ వరప్రసాద్‌రావ్, సివిల్ ఇఇ వినయ్‌సాగర్, ప్రతాపగిరి రాజు, జెఇ రాధాకృష్ణ, ఇతర అధికారులు పాల్గోన్నారు.