Saturday, December 21, 2024

జిఒ 58 క్రింద పట్టాల పంపిణీని పూర్తి చేయండి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి 58, 59 ప్రభుత్వ జిఓల అమలుకు క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ పురోగతిని జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జిఓ 58 క్రింద పట్టాల పంపిణీ కార్యక్రమం వెంటనే పూర్తి చేయాలన్నారు. జిఓ 59 కింద డిమాండ్ రుసుము వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నాలుగు వారాల్లో ఆమోదించిన దరఖాస్తుల డిమాండ్ మొత్తం వసూలు చేయాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో జిఓ 59 క్రింద 2559 దరఖాస్తుల ఆమోదం చేసి, రూ. 67 కోట్ల డిమాండ్ ఇవ్వనైనదని తెలిపారు. దరఖాస్తుదారులను నేరుగా కలుసుకొని డిమాండ్ చెల్లింపునకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. నెల లోపల డిమాండ్ మొత్తం వసూలుకు కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో సమావేశంలో కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, తహశీల్దార్లు శ్రీనివాసరావు, శైలజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News