Monday, December 23, 2024

కోటి మందికి పైగా పిల్లలకు మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి

- Advertisement -
- Advertisement -

Complete first dose vaccination for over one crore children

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కోటి మందికి పైగా 12-14 ఏళ్ల లోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం తెలిపారు. బయోలాజికల్ ఇ తయారు చేసిన కోర్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌ను ఈ వయసు పిల్లలకు మార్చి 16న వేయడం ప్రారంభించారు. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. గత ఏడాది మార్చి 1వ తేదీ నాటికి దేశంలో 12, 13 సంవత్సరాల వయసున్న పిల్లలు మొత్తం 4.7 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటి వరకు మొదటి డోసు కోటి మందికి పైగా పిల్లలకు వేసినట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News