Monday, December 23, 2024

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: ప్రతీ ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను పాటించడం వల్ల సమతుల్యత సాధించి సంపూర్ణ ఆరోగ్యంగా కొనసాగుతారని రామగుండం ఎన్టీపీసీ ఈడి సునీల్ కుమార్ అన్నారు. శనివారం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్ కాలనీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ను పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భారతీయ సంప్రదాయాల్లో యోగా అమూల్యమైదని అన్నారు. ప్రతి రోజూ యోగా పాటించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎదుగుదలతోపాటు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిఎంలు ఎసి ఠాకూర్, ఎకే దేశాయ్, రబీంద్ర సింగ్, హెచ్‌ఆర్ ఎజి ఎం బిజయ్ కుమార్ సిక్దర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News