Wednesday, January 22, 2025

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : యోగాతో సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవించవచ్చని, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. బుధవారం ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడా, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో ప్రజ్ఞా భారతి సంస్థ సహకారంతో యోగా దినోత్సవంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో యోగా అంటే ఇండియా.. ఇండియా అంటే యోగాల భావన వచ్చిందన్నారు.

యోగా మన వారసత్వ సంపద అని, దీనిని నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. విదేశాల్లో యోగాకు మంచి గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. మారే ప్రపంచంలో స్కిల్స్ నిత్యం మారుతుంటాయని, మన మీద మనకు స్వీయ నియంత్రణ ఉండాలన్నారు. మెడిటేషన్, ప్రాణయువు, యోగాతో ఒత్తిడిని జయించవచ్చని కలెక్టర్ అన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా శరీరం ఉల్లాసంగా తయారవుతుందని అన్నారు. యోగాతో అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వయోవృద్ధులు యోగాసనాల ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ యోగా గురువు చేయిస్తున్న యోగాను కార్యక్రమంలో పాల్గొన్న అందరితోపాటు కలెక్టర్ చేశారు. యోగాలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన సతీష్, చినబాబు లను అభినందించి, మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, జిల్లా పశుసంవర్థక అధికారి డా. వేణు మనోహర్, డా. కొలికొండ మహేంద్ర కుమార్, పరాశారం ప్రసాద్, ఆయుష్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News