Thursday, January 23, 2025

యోగాసానాలతో సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: యోగాసానాలు వేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధ్దిస్తుందని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బళ్ళారి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ యోగా డేను అజ్మీర తుకారాం అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిఎం మాట్లాడుతూ మీ కోసం మీ ఆరోగ్యం కోసం అనే నినాదంతో ప్రారంభించి యోగాను దీనిలో భాగం చేశారన్నారు. అన్ని ఏరియాలలో యోగా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం యోగా తరగతులు నిర్వహించే లాగా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు గనులతో పాటు మన సింగరేణిలో కూడా దీనిని ఆకర్షిస్తున్నామన్నారు.

దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు గనులతో పాటు మన సింగరేణిలో కూడా దీనిని ఆకర్షిస్తున్నామన్నారు. 2016లో సింగరేణి వ్యాప్తంగా 60వేల మందితో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించి అలాగే 2019లో సింగరేణి వ్యాప్తంగా లక్ష 27 వేల 437 మందితో సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టూ జిఎం బండి వెంకటయ్య, ఏజిఎం ఎస్ జ్యోతి, డిజిఎం రవికుమార్, పిఎం బి శివకేశవరావు, డిప్యూటి పిఎం బి శ్యామ్ ప్రసాద్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News