Sunday, December 22, 2024

వీటి గడువు ఈ నెలాఖరే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జూలై నెలలో కొన్ని పనులు గడువు లోగా పూర్తి చేసుకోండి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31 ఆఖరు తేదీగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 2023 జూలై 31గా నిర్ణయించారు. దీని తర్వాత ఐటిఆర్ ఫైల్ చేయలేరు. ఒకవేళ చేయాలనుకుంటే జరిమానాతో ఐటిఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయడానికి చివరి గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. దీనికి ముందు ఐటిఆర్ దాఖలు చేయకపోతే రిటర్న్ ఫైల్ చేయలేరు. ఐటిఆర్‌ని జూలై 31 తర్వాత డిసెంబర్ 31 లోపు ఫైల్ చేస్తే దానిని ఆలస్య ఐటిఆర్‌గా పరిగణిస్తారు. ఆలస్యంగా ఐటిఆర్ దాఖలు చేసినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పన్ను నిబంధనల ప్రకారం, ఐటిఆర్‌ని ధృవీకరించాలి. ఐటిఆర్ వెరిఫికేషన్‌ను 30 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

అధిక పెన్షన్ గడువు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద అధిక పెన్షన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులైన వ్యక్తులు జూలై 11లోపు దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఈ తేదీని జూన్ 20న ఇవ్వగా, ఈ గడువును జూలై 11 వరకు పొడిగించారు. అధిక పెన్షన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మూడుసార్లు పొడిగించారు.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎఫ్‌డి
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో పెట్టుబడికి చివరి తేదీ జూలై 7 వరకు పొడిగించారు. ఈ పథకం కింద అందించే అత్యధిక వడ్డీ రేటు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు 7.75 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు రూ.5 కోట్ల లోపు ఎఫ్‌డిలపై ఇస్తారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం నుండి 0.50 శాతం వరకు వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News