Friday, December 20, 2024

స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయండి

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీ పనులను వేగ వంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వరంగల్ లో కొనసాగుతున్న ఫేజ్ -1 అభివృద్ధి పనులను శుక్రవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంజీఎం జంక్షన్, గోపాల స్వామి గుడి ప్రాంతం, పోచమ్మ మైదాన్, వరంగల్ ఎస్.బి.ఐ ఏరియా, వరంగల్ పోస్ట్ ఆఫీస్ కూడలి, ఓ సిటీ ఏరియా, బాలాజీ నగర్ జంక్షన్ ప్రాంతాల్లో కమిషనర్ పరిశీలించి కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పనులలో భాగంగా ఫుట్‌పాత్‌లు, లైటింగ్ , లేన్ మార్కింగ్ పనులతో పాటు మిగిలిన బీటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్‌లు పనులను పూర్తి చేయడానికి చొరవ చూపకుంటే ఇంజనీరింగ్ విభాగం ద్వారా పూర్తి చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. పోచమ్మ మైదాన్ నుండి వరంగల్ చౌరస్తా వరకు మిగిలిపోయిన పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని, వీటితో పాటు సర్వీస్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, వరంగల్ పోస్టాఫీసు కూడలి ప్రాంతంలో ఫుట్ పాత్ పనులను పూర్తి చేసి,

డ్రైనేజీ నిర్మించి దానిపైన కప్పు నిర్మించాలని, పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని ఒక నెలలో పనుల లో పురోగతి కనిపించాలని,బాలాజీ నగర్ లో జంక్షన్ డ్రైనేజీ పనులకు అనుమతులు మంజూరు అయినందున తొందరగా పనులు మొదలయ్యేలాగా చూడాలని, స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణంలో భాగంగా పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలనీ, వెంకట్రామ జంక్షన్ నుండి ఓ సిటీ వరకు విద్యుత్ స్థంబాల తరలింపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమీషనర్ అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో సీఎం హెచ్ ఓ డా. రాజేష్, ఎస్.ఈ ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, బయలజిస్ట్ మాధవ రెడ్డి, ఈ.ఈలు శ్రీనివాస్, సంజయ్ కుమార్,శానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య తోపాటు స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News