Wednesday, January 22, 2025

రాజద్రోహం కేసులపై విచారణ… కేంద్రానికి సుప్రీం 24 గంటలు గడువు

- Advertisement -
- Advertisement -

Complete task of reconsideration of Sedition Law: SC

న్యూఢిల్లీ : భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 124 ఏ యధేశ్చగా దుర్వినియోగమవుతోందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల గడువు ఇచ్చింది. ఈ వివాదాస్పద సెక్షన్‌ను సమీక్షించాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రస్తుతం నమోదైన రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించాలని భావిస్తోందా? లేదా? బుధవారం నాటికి తెలియ జేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టాన్ని తిరిగి పరిశీలించేవరకు విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది.

రాజద్రోహం చట్టాన్ని తిరిగి పరిశీలించేందుకు ఎంతకాలం పడుతుందని , దీని దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని తిరిగి సమీక్షిస్తున్నామని చెబుతూ ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణను కొనసాగించవద్దని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టును కోరిన సంగతి తెలిసిందే. తిరిగి పరిశీలించడం జరుగుతోందని మెహతా చెప్పినప్పుడు సుప్రీం కోర్టు స్పందిస్తూ , రాజద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని అందోళన ఉందని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 124 ఎ పై తిరిగి పరిశీలించే ప్రక్రియను మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని , అప్పటివరకు ఈ సెక్షన్ ప్రకారం దాఖలైన కేసుల్లో తదుపరి చర్యలను చేపట్టకుండా తాత్కాలికంగా నిలిపి వేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని సలహా ఇచ్చింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News