Monday, December 23, 2024

లే అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం, నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే-అవుట్ ఆమోదం కొరకై అందిన 24 దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించబడిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాల, టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుంచి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను 21 రోజుల లోపు ఆయా శాఖలకు సంబంధించిన అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు. గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు. అనుమతులు జారీకి సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పిదపనే అనుమతులు జారీచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళికబద్దంగా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఇరిగేషన్ సిఇ శంకర్ నాయక్, అర్‌డిఓ రవీంద్రనాధ్, జడ్‌పి సిఇఓ వివి. అప్పారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఎడి. శ్రీనివాసులు, ఎస్‌ఇఅర్ అండ్ బి.లక్ష్మణ్, పిఆర్‌ఇఇ కెవి కెశ్రీనివాస్ సత్తుపల్లి, వైరా, మునిసిపల్ కమీషనర్‌లు సుజాత, వెంకటేశ్వర్లు, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కొణిజర్ల, రఘనాథపాలెం, తహశీల్దార్లు శైలజ,సుమ, సైదులు, నరసింహారావు, ఇరిగేషన్, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News