మన తెలంగాణ నల్గొండ రూరల్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకమండలి సూచించిన ఆదేశాల ప్రకారం పోలీస్ కానిస్టేబుల్/యస్.ఐ ప్రాథమిక పరీక్షలలో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియం నందు అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు5 రోజుల పాటు దేహదారుడ్య పరీక్షలను నిర్వహించటం జరిగిందని, ఈ దేహదారుడ్య పరీక్షలకు మొత్తం 4790 మంది అభ్యర్థులకు గాను 4049 అభ్యర్థులు హాజరు కాగా 1252 మంది అభ్యర్థులు అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారని జిల్లా యస్‌పి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు నియామక మండలి సూచించిన ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యాధునిక పరికరాలను, సాంకేతికతను ఉపయోగించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రౌండ్ మొత్తం సీసీకెమెరాల నిఘాలో అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించటం జరిగిందని అన్నారు.
జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, డిపిఓ సిబ్బంది, పీఈటీ టీచర్లు మరియు సాంకేతిక నిపుల సహకారంతో ప్రశాంతంగా దేహదారుడ్య పరీక్షలు పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 3 గంటల నుండి ప్రక్రియ మొదలు పెట్టి దేహదారుడ్య పరీక్షలు పూర్తి అయ్యే వరకు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మైదానంలో ఈవెంట్స్‌లో పాల్గొన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి, పీఈటీ టీచర్లకు, టెక్నికల్ సిబ్బందికి, మెడికల్ సిబ్బంది, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు అడిషినల్ ఎస్పీ కెఆర్ ప్రసాద్‌రావు, డియస్‌పిలు, నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, వెంకటగిరి, మోగిలయ్య, రమేష్, సురేష్, ఏఓ మంజు భార్గవి, సీఐలు, ఆర్‌ఐలు, యస్‌లు, సిబ్బంది, టెక్నికల్ టీం సిబ్బంది, మెడికల్ సిబ్బంది, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.